ట్రంప్‌కు భారీ న‌ష్టం… హోట‌ల్ అమ్మేందుకు సిద్దం…

ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడు కాక‌ముందు పెద్ద వ్యాపారి.  స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌.  రియ‌ల్ ఎస్టేట్‌, హోట‌ల్ బిజినెస్ ఇలా ఎన్నో బిజినెస్ రంగాల్లో సక్సెస్ సాధించాడు.  అమెరికాలో ఆయ‌న‌కు అనేక హోట‌ల్స్ ఉన్నాయి.  అయితే, వాషింగ్ట‌న్‌లోని అధ్య‌క్ష భ‌వ‌నానికి కూత‌వేటు దూరంలో ఉన్న ట్రంప్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్ న‌ష్టాల బాట ప‌ట్టింది.  దాదాపు 70 మిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టాన్ని మూట‌క‌ట్టుకుంది.  2016 లో ఈ హోట‌ల్‌ను తీసుకున్న ట్రంప్ మూడేళ్ల‌పాటు స‌క్సెస్‌గా ర‌న్ చేశారు.  

Read: ఫ‌లించ‌ని ఉద్యోగం వేట‌… ఛాయ్ దుకాణంతో నెర‌వేరిన క‌ల‌…

అయితే, 2020లో క‌రోనా కార‌ణంగా లాస్ వ‌చ్చింది.  2019 నుంచే హోట‌ల్ ను అమ్మేయ్యాల‌ని ప్ర‌య‌త్నం చేసినా కుద‌ర‌లేదు.  కాగా, ఇప్పుడు మియామీకి చెందిన హిల్ట‌న్ గ్రూప్ ఈ హోట‌ల్‌ను 60 ఏళ్ల‌కు లీజ్‌కు తీసుకున్న‌ది.  వాల్డ‌ర్ హోట‌ల్‌గా ఈ హోట‌ల్ మార‌బోతున్న‌ది. అమెరికా అధ్య‌క్షుడిగా కొన‌సాగినంత కాలం ఈ హోట‌ల్ రిప‌బ్లిక‌న్ల హోట‌ల్‌గా మారింది.  కాగా, ఈ హోట‌ల్ న‌ష్టాల బాట ప‌ట్ట‌డంతో హిల్ట‌న్ గ్రూప్‌కు లీజ్‌కు ఇచ్చేశారు.  

Related Articles

Latest Articles