Site icon NTV Telugu

భారీ కుట్ర భగ్నం..

Delhi Police

Delhi Police

భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్‌, 50 లైవ్‌ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్‌వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఢిల్లీలోని ఎర్రకోట, పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అలర్ట్‌ అయ్యారు. ఇప్పటికే డ్రోన్లను నిషేధించారు. బెలూన్లను ఎగరేసిందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు.

Exit mobile version