ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పును సీబీఐ కోర్టు రిజర్వ్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని మనీశ్ సిసోడియా పిటిషన్ ధాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసింది సిబిఐ కోర్టు.
Also Read:Finance Bill: లోక్‌సభలో ఆర్థిక బిల్లుకు ఆమోదం.. పింఛను వ్యవస్థను పరిశీలించేందుకు కమిటీ
ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై మార్చి 31న తీర్పును ప్రకటిస్తామని ఢిల్లీ కోర్టు తెలిపింది. బెయిల్ కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. నిందితుల రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుకు వ్యతిరేకంగా సీబీఐ తరపున మరో పిటిషన్ దాఖలు చేసింది. సిసోడియాను ఏడు రోజుల పాటు కస్టడీలో ఉంచిన సిబిఐ ఇప్పటి వరకు విచారణ జరిపింది.
Also Read: MLA Vamsi: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు దిట్ట
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను ఫిబ్రవరి 26న కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. మార్చి 9న, సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్టు చేసింది.