దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతిరోజూ లక్ష కోవిడ్ కేసులు వచ్చినా చికిత్స అందించడంతో పాటు ప్రతిరోజూ 3 లక్షల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది.
Read: లైవ్: ఏపీ మంత్రి కన్నబాబు ప్రెస్ మీట్…
ఒమిక్రాన్ వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనడానికి అవసరమైన మెడిసిన్‌ను నిల్వచేసుకోవడంతో పాటు, మానవ వనరులను కూడా సిద్ధం చేసుకున్నామని అన్నారు. కొద్దిపాటి లక్షణాలున్నవారు ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరమని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది.
