Site icon NTV Telugu

క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…

క‌రోనా మ‌హ‌మ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ ఇప్ప‌టికే 2 గా న‌మోదంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 ఉంటేనే వైర‌స్ తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయ‌ని, కానీ ప్ర‌జ‌లెవ‌రూ ప్యానిక్ కావొద్ద‌ని అన్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని, ఈరోజు 3100 కొత్త కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.  

Read: థ‌ర్డ్ వేవ్ అనివార్యం… ఫైట్ చేయ‌క త‌ప్ప‌దు…

ఢిల్లీలో 246 బెడ్స్‌లో క‌రోనా పేషెంట్స్ చికిత్స పొందుతున్నారని, కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న‌ల మేర‌కు కోవిడ్ ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేజ్రీవాల్ తెలిపారు.  కొత్త కేసుల్లో చాలా వ‌ర‌కు ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ భ‌రోసా ఇచ్చారు.  రాష్ట్రంలో అన్ని ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ సిలీండ‌ర్లను ఏర్పాటు చేసుకున్నామ‌ని, ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అన్నారు.  

Exit mobile version