ఇప్పటి వరకు మనదేశం రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై అధారపడుతూ వచ్చింది. అయితే, ఆత్మనిర్భర్ భారత్ పేరుతో స్వదేశీ వస్తువులను కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థకు సంబందించి అనేక ఆయుధాలను ప్రస్తుతం సొంతంగా ఇండియాలోనే తయారు చేసుకుంటున్నారు. మెషిన్ గన్, తేలికపాటి యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను, క్షిపణులను ఇండియాలోనే తయారు చేసుకుంటున్నారు. అంతేకాదు, యుద్ధ షిప్పులు, జలాంతర్గాములు వంటివి కూడా ఇండియాలోనే తయారవుతున్నాయి. కాగా, ఇప్పుడు ఇండియా సొంత టెక్నాలజీతో 75 అధునాతన ఫీచర్లతో కూడిన అర్జున ఎంకే 1 ఏ అనే యుద్ధ ట్యాంకును తయారు చేసింది. అధునాతన టెక్నాలజీతో తయారు చేయడంతో పాటుగా అత్యాధునిక సామర్ధ్యం కలిగి ఉండటంతో రక్షణశాఖ ఈ యుద్ధ ట్యాంకుల కోసం ఆర్డర్ చేసింది. మొత్తం 118 అర్జున ఎంకే 1ఏ ట్యాంకులకు ఆర్డర్ ఇచ్చింది రక్షణ శాఖ. చెన్నైలోని అవడి భారీ వాహనాల తయారీ ఫ్యాక్టరీలో ఈ అర్జున ట్యాంకర్లు తయారవుతున్నాయి. 118 అర్జున ట్యాంకర్ల కోసం రక్షణశాఖ రూ.7523 కోట్లు ఖర్చుచేస్తున్నది. మొదట 30 నెలల కాలంలో ఐదు యుద్ధట్యాంకులను సరఫరా చేస్తుంది. అనంతరం ప్రతి ఏడాది 30యుద్ధ ట్యాంకులను రక్షణశాఖకు అందజేయనున్నది.
Read: భారత్‌లో దాడులకు ఉగ్రవాద సంస్థలు కుట్రలు చేస్తున్నాయా?
