ఉత్తర్‌ప్రదేశ్ ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడు ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష పడింది. ఈ ఆలయంలోకి చొరబడి కత్తితో బీభత్సం సృష్టించిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముర్తజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది. దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌నాథ్ ఆలయంలో భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికే చెందిన అబ్బాసీ.. కత్తితో వీరంగం సృష్టించి.. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన యూపీ పీఏసీ జవాన్లపై దాడి చేశాడు. నవరాత్రి వేడుకల్లో భాగంగా గుడిలో భక్తులు భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.
RK Roja: మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా నియామకం..
ఉగ్ర కుట్రలో భాగంగానే అబ్బాసీ ఈ ఘటనకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో అబ్బాసీ నుంచి కీలక విషయాలు బయటికొచ్చాయి. తనకు ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అతడు దర్యాప్తులో అంగీకరించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువరించింది. అబ్బాసీ.. ఐఐటీ ముంబై నుంచి 2015లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అతడు మానసిక పరిస్థితి బాగోలేదని అబ్బాసీ కుటుంబసభ్యులు తెలిపారు.
Prithvi Shaw: రెండో గర్ల్‌ఫ్రెండ్‌తోనూ పృథ్వీ షా బ్రేకప్.. పాపం మళ్లీనా!