బంగారం స్మగ్లర్ల పాలిట వరంగా మారుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే టార్గెట్ గా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారం సీజ్ చేశారు. కొలంబో ప్రయాణీకుల వద్ద 1.53 కోట్ల రూపాయల విలువ చేసే 3.1 కేజీల బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చారు. ఆ పేస్టును క్యాప్సుల్స్ రూపంలోకి మార్చారు. సినీ ఫక్కీలో ఈ క్యాప్సుల్స్ ని మింగించారు. మలద్వారంలో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్ళు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో 10 మంది ముఠా సభ్యుల పై అనుమానం కలగడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేశారు కస్టమ్స్ బృందం. కడుపులో దాచిన బంగారం గుట్టును రట్టు చేసారు కస్టమ్స్ అధికారులు. బంగారం సీజ్ చేశారు. 10 మంది ప్రయాణీకుల పై కేసు నమోదు చేశారు. కేసుని దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.