Site icon NTV Telugu

ఎయిర్ పోర్ట్‌లో లంచావతారం.. కస్టమ్స్ అధికారిపై ఫిర్యాదు

ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది.

లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. కస్టమ్స్ ఆధికారులు డ్యూటీ ఫ్రీలో తెచ్చిన వస్తువుల విషయంలోనూ అభ్యంతరం చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ఈస్ట్ గోదావరికి చెందిన ప్రయాణికుడు షార్జా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతడి పట్ల తీవ్ర అవమానకరంగా ప్రవర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారుల తీరుపై ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version