ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్ రెస్టారెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించి రెస్టారెంట్‌లోకి వస్తే వారికి బిల్లుపై అదనంగా 5 డాలర్లు జరిమానా విధిస్తామని ప్రకటించిది. అయినప్పటికీ ప్రజలు మాస్క్ లేకుండా రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ఏ మాత్రం ఒప్పుకోవడంలేదు. 5 డాలర్లు అదనంగా కట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, మాస్క్ మాత్రం తీయడం లేదని రెస్టారెంట్ యాజమాన్యం చెబుతున్నది. అదనంగా వసూలు చేస్తున్న 5 డాలర్లను స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్టు రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.
అక్కడ మాస్క్ ధరిస్తే…భారీ జరిమానా… ఎందుకంటే…
