Site icon NTV Telugu

నిజామాబాద్ హైవేపై కరెన్సీ నోట్ల కలకలం

నిజామాబాద్ జాతీయ రహదారి పై కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నోట్లని తుక్కు గా మార్చి తగలబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నోట్లు భారీగానే వున్నట్టుగా చెబుతున్నారు. జిల్లాలోని బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే కనపడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు.

ఒక వాహనం నుండి సంచి పడిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై తగలబెట్టినవి దొంగ నోట్లా అసలు నోట్లా అనే దానిపై విచారణ జరుగుతోంది. జాతీయ రహదారిపై సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీస్ లు ఎవరీ పని చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారం బుస్సాపూర్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version