NTV Telugu Site icon

ప్ర‌ముఖుల ర‌క్ష‌ణ కోసం రంగంలోకి మ‌హిళా క‌మాండోలు…

ర‌క్ష‌ణ రంగంలో పురుషుల‌తో పాటుగా మ‌హిళ‌లు కూడా రాణిస్తున్నారు.  బోర్డ‌ర్‌లో ప‌హారా కాస్తున్నారు.  ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌, నేవీ రంగాల్లో మ‌హిళ‌లు రాణిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో అత్య‌ధిక రిస్క్ ఎదుర్కొంటున్న వ్య‌క్తుల ర‌క్ష‌ణ కోసం మ‌హిళా క‌మాండోలను నియ‌మించ‌బోతున్నారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల‌కు మ‌హిళా కమాండోలు ర‌క్ష‌ణ‌గా ఉండ‌బోతున్నారు.  ఈ ముగ్గురికి మ‌హిళా కమాండోలను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు ర‌క్ష‌ణశాఖ స్ప‌ష్టం చేసింది.  32 మంది మ‌హిళ‌లు మ‌హిళా కమాండోలుగా శిక్ష‌ణ తీసుకున్నారు.  వీరికి ప‌ది వారాల‌పాటు శిక్ష‌ణ ఇచ్చారు.

Read: నాసా మ‌రో హెచ్చ‌రిక‌: భూమివైపు దూసుకొస్తున్న పెనుముప్పు…