Site icon NTV Telugu

CRPF Constable Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1.30 లక్షల పోస్టులకు నోటిఫికేషన్

Crpf

Crpf

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌(CRPF)లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 1,29,929 ఉద్యోగాల్లో 1,25,262 పోస్టులకు పురుష అభ్యర్థులు, 4, 667 పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.

Also Read:Bandi Sanjay : నా ప్రియమైన కార్యకర్తలారా.. భరతమాత ముద్దు బిడ్డల్లారా.. కార్యకర్తలకు బండి సంజయ్ లేఖ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానాన్ని ఉత్తీర్ణులై ఉండాలి లేదా మాజీ ఆర్మీ సిబ్బందికి సమానమైన ఆర్మీ అర్హతను కలిగి ఉండాలి. పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తదుపరి ప్రాసెసింగ్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, వ్రాత పరీక్షలో అర్హత సాధించాలి. ఈ ఉద్యోగాలకు రూ.21,700 నుంచి 69, 100 వరకు వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది. అయితే, ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన తేదీలను మాత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు.

Exit mobile version