Site icon NTV Telugu

విచిత్రం: డ్రోన్‌పై కాకి దాడి… ఎందుకో తెలుసా?

డ్రోన్ టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎత్తైన ప్ర‌తేశాల నుంచి ఫొటోలు, వీడియోలు మాత్ర‌మే కాదు, అత్య‌వ‌స‌ర మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి వినియోగిస్తున్నారు.  కాగా, ఇప్పుడు ఫుడ్ డెలివ‌రీ యాప్‌ల‌లో కూడా డ్రోన్‌ల‌ను వినియోగిస్తున్నారు.  డ్రోన్ టెక్నాల‌జీ స‌హాయంతో ఆస్ట్రేలియాలో ఓ యాప్ ఫుడ్ డెలివ‌రీ చేస్తున్న‌ది.  ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో డ్రోన్‌ల ద్వారా ఫుడ్‌ను డెలివ‌రీ చేస్తున్నారు.  కాన్‌బెర్రాకు చెందిన రాబ‌ర్డ్ అనే వ్య‌క్తి కాఫీ ఆర్డ‌ర్ చేశారు.  ఆర్డ‌ర్ కోసం ఎదురు చూస్తుండ‌గా, ఆకాశంలో డ్రోన్ ఎగురుతూ వ‌స్తున్న‌ది. ఇంత‌లో ఓ పెద్ద కాకి ఆ డ్రోన్‌పై దాడి చేసింది,  డ్రోన్‌ను అటుఇటూ కుదిపేసింది.  కాసేప‌టికి డ్రోన్‌ను వ‌దిలేసి వెళ్లిపోయింది.  అనంత‌రం డ్రోన్ సుర‌క్షితంగా కాఫీని క‌స్ట‌మ‌ర్‌కు డెలివ‌రీ చేసింది.  ఈ తతంగాన్ని కింద‌నుంచి చూస్తున్న రాబ‌ర్ట్ వీడీయోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది.  ఏదో విచిత్ర‌మైన ప‌క్షి అనుకొని కాకి దాడి చేసి ఉంటుంద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. అయితే, డ్రోన్‌కు అమ‌ర్చిన కాఫీ కోస‌మే ఆ కాకి దాడి చేసి ఉండొచ్చ‌ని యాప్ యాజ‌మాన్యం చెబుతున్న‌ది. 

Read: ఆ చెట్టుకోసం నెల‌కు ల‌క్ష ఖ‌ర్చు… చుట్టూ వీవీఐపీ భద్రత… ఎందుకంటే…

Exit mobile version