Site icon NTV Telugu

ఏపీ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి

రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ రాష్ట్రానికి అంతా తామే చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆడిన మాటను తప్పే వారిని ఏమంటారో బీజేపీ వాళ్లు గుర్తు చేసుకుంటే మంచిదన్నారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేని బీజేపీ విశాఖ ఉక్కును అమ్మేస్తానంటోంది.ప్రజలు బీజేపీని ఛీత్కరిస్తున్నారు.బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ, టిడిపి పోరాడాలి.బీజేపీ దూకుడుకు వ్యతిరేకంగా పోరాడుతాం.వైసీపీ పాలన బీజేపీ ఆర్థిక విధానాలను అమలు చేస్తోంది.టీడీపీ బాటలోనే వైసీపీ నడుస్తోంది. అమూల్ విస్తరణకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం సరికాదు.

ఆమూల్ టెక్నాలజీని వినియోగించుకుంటే అభ్యంతరం లేదు. అమూల్ విస్తరణ పేరుతో సహకార పాల ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతిస్తే మంచిది కాదు.సహకార పాల ఉత్పత్తి కేంద్రాలకు ప్రభుత్వం తోడ్పాటు అవసరం. వైసీపీ ప్రజలపై భారీగా పన్నుల భారం మోపుతోంది.

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తాం అన్నారు. రాష్ట్రంలో వామపక్షాల బలోపేతానికి కృషి చేస్తాం. రాష్ట్రంలో వామపక్షాలు బలహీనపడ్డ మాట వాస్తవం. ప్రజలకు చేరువుగా పార్టీని తీసుకెళతాం అన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని, బీజేపీ అజెండాను వైసీపీ అమలు చేస్తోందన్నారు సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరులో టీడీపీ, జనసేన కలిసి రావాలని ఆయన కోరారు.

Exit mobile version