NTV Telugu Site icon

కిడ్నీలపై కోవిడ్ ప్రభావం…జాగ్రత్తలు తీసుకోకుంటే…

కరోనా మహమ్మారి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నది.  ముఖ్యంగా ఊపిరితిత్తులపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది.  శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వ్యక్తులపై ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది.  ఇక ఊపిరి తిత్తుల తరువాత దీని ప్రభావం కిడ్నీలపై అధికంగా కనిపిస్తోంది.  కిడ్నీల జబ్బులతో బాధపడేవారు కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  లేదంటే కిడ్నీలు దెబ్బతింటాయని, ఫలితంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కరోనా బారిన పడిన సమయంలో ఏవైనా చిన్న చిన్న కిడ్నీల సమస్యలు ఉంటె ట్రీట్మెంట్ సమయంలో వినియోగించే మెడిసిన్ కారణంగా ఆ సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.  తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని, లేదంటే ప్రాణాలు పోవడం ఖాయమని నిపుణులు సూచిస్తున్నారు.