Site icon NTV Telugu

ఆయుర్థాయంపై క‌రోనా ప్ర‌భావం… భ‌య‌పెడుతున్న స‌ర్వే…

క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాదిమంది ప్ర‌జ‌లు క‌రోనాబారిన ప‌డుతున్నారు.  ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల మందికి పైగా మృతి చెందారు.  ఆరోగ్య ప‌ర‌గంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  క‌రోనా కార‌ణంగా ప్ర‌జల ఆయుర్థాయం భారీగా త‌గ్గిపోతున్న‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  రెండో ప్ర‌పంచ యుద్ధం త‌రువాత ప్ర‌జ‌ల ఆయుర్ధాయం భారీగా త‌గ్గింద‌ని, కోవిడ్ త‌రువాత రెండోసారి భారీగా ప్ర‌జ‌ల ఆయుర్థాయం త‌గ్గిపోయిన‌ట్టు ప‌రిశోధ‌కుల స‌ర్వేలో తేలింది.  మొత్తం 29 దేశాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌పై ఈ స‌ర్వేను నిర్వ‌హించారు.  ఇందులో అమెరికా ప్ర‌జ‌ల స‌గ‌టు ఆయుర్థాయం రెండేళ్ల మేర త‌గ్గిన‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  22 దేశాల ప్ర‌జ‌ల ఆయుర్థాయం స‌గ‌టున ఆరునెల‌ల వ‌ర‌కు త‌గ్గిపోయిన‌ట్టు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటి విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌న‌లో తేలింది.  

Read: ఆరు నెల‌లు కాదు… ఏడేళ్ల నుంచి ప‌నిచేస్తూనే ఉన్న‌ది… శ‌భాష్ మంగ‌ళ్‌యాన్‌…

Exit mobile version