NTV Telugu Site icon

కరోనా చికిత్సకు కొత్త ఔషధం… నేడే విడుదల 

కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశంలో ప్రస్తుతం మూడు రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.  కాగా, ఇప్పుడు డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ ఔషధాన్ని తయారు చేసింది.  అది 2 డిజీ ఔషధం. రెడ్డీస్ ల్యాబ్స్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది.  
ఈరోజు ఈ ఔషధాన్ని రిలీజ్ చేస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ఈరోజు రిలీజ్ చేస్తున్నారు.  మొదటగా వీటిని ఢిల్లీలోని డిఆర్డిఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందించనున్నారు.  పౌడర్ రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.