ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ దాడులు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒమిక్రాన్ దెబ్బకు దేశాలకు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ యూరప్, అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంమీద లక్షన్నర కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఇండియాలో నిర్వహించారు. అయినప్పటికీ కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read: ఆ ఘటనకు వైసీపీ, టీడీపీలు బాధ్యత వహించాలి…
జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో నాలుగో వేవ్ నడుస్తోందని, ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ హెచ్చరించింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట నిబంధనలు క్రాస్ చేయవద్ధని, అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికీ ఇండియాలో డెల్టా వేరియంట్ డామినేట్ చేస్తున్నదని, ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నా తీవ్రత తక్కువగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ముప్పు తప్పదని అన్నారు.
