NTV Telugu Site icon

కోవిడ్ ఎఫెక్ట్‌: పిల్ల‌ల్లో పెరుగుతున్న ఊబ‌కాయం…

క‌రోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి.  క‌రోనా కార‌ణంగా పిల్ల‌లు ఇంటికే ప‌రిమితం అవుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచిన‌ప్ప‌టికి క‌రోనా భ‌యంతో పిల్ల‌ల‌ను ఇంటినుంచే చ‌దివించేందుకు తల్లిదండ్రులు ఆస‌క్తి చూపుతున్నారు.  క‌రోనా స‌మ‌యంలో ఇంటిప‌ట్టునే ఉండ‌టంతో పిల్ల‌లు అధిక బ‌రువు పెరుగుతున్న‌ట్టు అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియోష‌న్ జ‌ర్న‌ల్ స‌ర్వేలో తేలింది.  5-11 ఏళ్ల వ‌య‌సున్న పిల్ల‌లు క‌రోనా కాలంలో బ‌రువు పెరిగిన‌ట్టు ఈ స‌ర్వే పేర్కొన్న‌ది.  కోవిడ్ కాలంలో 5-11 ఏళ్ల లోపున్న పిల్ల‌లు 2.5 కేజీల బ‌రువు పెరిగార‌ని, 12 ఏళ్లు పైబ‌డిన పిల్ల‌లు 2 కేజీల బ‌రువు పెరిగిన‌ట్టు స‌ర్వేలో తెలింది.  ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం, వ్యాయామం వంటివి త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు. లేదంటే భ‌విష్య‌త్తులో అధిక‌బ‌రువు కార‌ణంగా అనేక ఇబ్బందులో త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెబుతున్నారు.  

Read: వారికి ఆక‌ర్షించ‌డం కోస‌మే ఆ విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేశారా?