Site icon NTV Telugu

ఎలుక‌ల ద్వారా క‌రోనా…!!?

గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసులు ప్ర‌పంచంలో పెరుగుతున్నాయి.  యూర‌ప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉధృతి క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  కాగా ఇప్పుడు తైవాన్‌లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  రెండోసారి క‌రోనా కేసులు ఎలా మొద‌ల‌య్యాయి అనే అంశంపై ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఓ షాకింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  రెండోసారి క‌రోనా ఓ మ‌హిళా సైంటిస్ట్ కు సోకింద‌ని అమె ద్వారా తైవాన్‌లో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డైంది.  

Read: పెరుగు కోసం రైలును ఆపేసిన డ్రైవ‌ర్‌… వైరల్ కావ‌డంతో…

తైవాన్‌లో హైసెక్యూరిటీ ల్యాబ్‌లో ఆ మ‌హిళ ప‌నిచేస్తున్న‌ది.  అయితే, ఈ ల్యాబ్‌లో క‌రోనా సోకిన ఎలుక ఆమెను రెండుసార్లు క‌రిచింది.  ఎలుక క‌రిచిన త‌రువాత‌నే ఆ మ‌హిళ‌కు క‌రోనా సోకిన‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఎలుక‌ల ద్వారా క‌రోనా సోక‌డం నిజ‌మైతే మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి వ‌స్తుంద‌ని, తైవాన్ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

Exit mobile version