కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు ఇండియాను సైతం వదలనంటోంది. కరోనా దాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలు అతాలకుతలమవుతున్నాయి. ఇప్పడిప్పుడే డెల్టా వేరియంట్ భారత్‌లో తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో రోజురోజు మరోసారి కోవిడ్ విజృంభన పెరుగుతోంది. గత వారం వరకు 7వేల లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పటి రెట్టింపుగా నమోదవుతున్నాయి.
తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదవగా, 268 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో కరోనా నుంచి 7,486 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 82,402 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ కూడా భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961 కు చేరుకుంది.
