Site icon NTV Telugu

సిద్ధూని వెన‌కేసుకొచ్చిన కాంగ్రెస్…ఆయ‌న నేతృత్వంలోనే ఎన్నిక‌ల‌కు…

వ‌చ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంత‌ర్గ‌త క‌ల‌హాల కార‌ణంగా ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేశారు.  అనంత‌రం ఆయ‌న పీసీపీ అధ్య‌క్షుడు సిద్ధూపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ఈ వ్యాఖ్య‌ల‌పై అటు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.  పైగా సిద్ధూను వెన‌కేసుకు వ‌చ్చింది.  రాష్ట్రంలో సిద్ధూకు మంచి పాపులారిటి ఉంద‌ని, ముందుండి న‌డిపించే స‌త్తా ఉన్న నాయ‌కుడు సిద్ధూ అని, ఆయ‌న నేతృత్వంలోనే వ‌చ్చే ఏడాది పంజాబ్ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంద‌ని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావ‌త్ పేర్కొన్నారు.  పంజాబ్ నుంచి ఎవ‌రెవ‌రు పోటీ చేస్తారు అనే విషయాన్ని అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని రావ‌త్ తెలిపారు.  

Read: న‌గ‌రంలో కొన‌సాగుతున్న గ‌ణేశ్ నిమ‌జ్జనం… బారులు తీరిన గ‌ణ‌ప‌య్య‌లు…

Exit mobile version