హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోయిన విషయం విధితమే. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెడుతామని ప్రకటన కూడా చేశారు. అనంతరం జరిగిన హుజురబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
హుజరాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పరోక్షంగా ఈటల రాజేందర్ ను లాభం జరిగిందని ఆయన అన్నారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ లో ఉంటే టీఆర్‌ఎస్ పార్టీ గెలిచేదని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో టీఆర్‌ఎస్ ఓటమికి కారణం కేసీఆర్ స్వయం కృతాపరధమేనని జీవన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.