కరోనా మహమ్మారి వల్ల రోజురోజుకూ మరణాలు పెరుగుతున్నాయి. కోవిడ్ -19 సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. తాజాగా టాలీవుడ్ నటుడు కమెడియన్ గౌతంరాజు సోదరుడు సిద్ధార్థ్ కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గౌతమ్ రాజు స్వస్థలమైన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధార్థ్ వైరస్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచాడు. గౌతమ్ రాజు ఈ విచారకరమైన వార్తను వీడియో ద్వారా వెల్లడించారు. బయట పరిస్థితులు బాగాలేవని అందరూ జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.
అయితే తన సోదరుడి మరణానికి కారణం కొందరు వైద్యుల నిర్లక్ష్యమే అని సంచలన ఆరోపణలు చేశారు. రికమండేషన్ మీద వస్తున్న కేసుల కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగుల ప్రాణాలను బలి ఇస్తున్నారని, ప్రభుత్వం సదుపాయాలు కల్పించినా కొందరు వైద్యులు కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు గౌతమ్ రాజు.