దేశంలో చలిగాలులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 3.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read: ఇలాంటి లైఫ్ ను మళ్లీ చూడగలమా… నెటిజన్ల ఆవేదన…
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో డిసెంబర్ 23, 24 తేదీల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడారి రాష్ట్రం రాజస్తాన్‌లోని చురులోలో -0.5 డిగ్రీలు, ఫతేపూర్‌లో -1.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి. ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి.
