సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. తెలుగు సంప్రదాయంలో భాగంగా కోడి పందేలకు అనుమతులు ఇచ్చినా, తెరవెనుక కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది వందల సంఖ్యలో కోళ్లను, కోట్ల రూపాయల నగదులు, అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఏడాది తిరిగేసరికి షరామామూలే.
Read: ఆ కారిడార్‌పై చైనా కన్ను… అదే జరిగితే…
అయితే, ఈసారి సంక్రాంతి పండుగ రాకముందే కొన్ని ప్రాంతాల్లో కోళ్ల పందేలు మొదలయ్యాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని నాగిరెడ్డి గూడెంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. ఈ పందేల్లో పాల్గొన్న 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.