తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియ చేశారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం, నేటికీ అందరికీ ఆచరణీయమని అని సిఎం అన్నారు.
క్రిస్మస్ సందర్భంగా అటు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని పేర్కొన్నారు సీఎం జగన్..
