NTV Telugu Site icon

CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు

Kcr And Rahul

Kcr And Rahul

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు అని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని చెప్పారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం అని కేసీఆర్ ఆక్షేపించారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది అని అన్నారు. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని హెచ్చరించారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Also Read:Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

కాగా, ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూర‌త్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌స‌భ సెక్రటేరియేట్ అనర్హత వేటు వేసింది. లోక్‌స‌భ నుంచి ఆయ‌న్ను డిస్‌క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 23వ తేదీ నుంచి అనర్హత వేటు అమ‌లులోకి వ‌స్తుంద‌ని స్పష్టం చేసింది.