NTV Telugu Site icon

బ్లాక్ ఫంగస్‌ కలకలం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

cm jagan

కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో ఉచితంగా వైద్యం చేయాలని ఏపీ సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతే కాదు కరోనాతో తల్లిదండ్రులు మృతి చెందితే.. వారి పిల్లలను అదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం కర్ఫ్యూ అమలులోకి వచ్చి 10 రోజులు మాత్రమే అయ్యిందని, కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడం మేలని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీలో మే 31 వరకు కర్ఫ్యూ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్.