NTV Telugu Site icon

ఎదిగే కొద్ది ఒదగాలి అనేది నా విధానం : సిఎం జగన్

cm jagan

cm jagan

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..ఎదిగే కొద్ది ఒదగాలి అనేది తన విధానం.. మనమంతా ప్రజలకు సేవకులమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మేవరకు తోడుగా నిలబడుతున్నామని.. ఆర్బీకేల ద్వారా కల్తీ లేని విత్తనాలు, మందులు, ఇన్ పుట్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని..కుట్రలు చేసి పంచాయతీలపై ఆకుపచ్చ, నీలం రంగులను తుడిచివేయించగలిగారని టిడిపి కి చురకలు అంటించారు. జనం గుండెల్లో ఉన్న రంగులు తుడిచివేయలేకపోయారని.. చెప్పిన మాట ప్రకారం నిర్ణీత సమయానికి క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాల నిధులు చెల్లిస్తామన్నారు. క్రెడిబులిటీ ఉన్న ప్రభుత్వంగా ప్రజల్లో గుర్తింపు పొందామని.. రెండేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీలు ,పేద, మధ్యతరగతి వారి కోసం నిలబడ్డామని పేర్కొన్నారు. 23 నెలల కాలంలో 93708 కోట్లు పేదలైన లబ్దిదారుల ఖాతాల్లో వేశామని.. 31714 కోట్లు పథకాల ద్వారా పరోక్షంగా లబ్ది చేకూర్చామన్నారు. మొత్తంగా 1.25 లక్షల కోట్ల మేర నిధులను ప్రజలకు అందించగలిగామని పేర్కొన్నారు.