Site icon NTV Telugu

కిడ్నీ పేషంట్‌కు భరోసా ఇచ్చిన జగన్

ఏపీ సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సరస్వతి నగర్‌లో జగన్ బాధితులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో సీఎం వైయస్ జగన్ ను కలిశారు కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు.

కుసుమ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన ముఖ్యమంత్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇచ్చే ఫించను అందుతుందా? లేదా? అని వివరాలు తెలుసుకున్నారు. తనకు ప్రతినెలా పింఛను అందుతోందని కుసుమ భర్త చంద్రశేఖర్ వివరించారు. తన భార్యకు ఊపిరి తిత్తులలో నీరు చేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కి తమ కష్టాలు చెప్పుకున్నారు కుసుమ కుటుంబ సభ్యులు. కుసుమ వైద్య ఖర్చులకు తగిన ఆర్థిక సాయానికి భరోసా ఇచ్చారు సీఎం వైయస్ జగన్. వారి కుటుంబానికి తగిన సాయం చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్.

Exit mobile version