Site icon NTV Telugu

సీఎంకు కొరడా దెబ్బలు..! వీడియో వైరల్‌

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు తిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అదేంటి సీఎంకు కొరడా దెబ్బలు ఏంటి? అనే అనుమానం వెంటనే కలుగొచ్చు.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, భక్తుల విశ్వాసం మేరకు కొన్ని చేస్తుంటారు.. అలాంటే నమ్మకాన్నే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్ ఫాలో అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా..

ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్‌లో ప్రతి ఏడాది గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తులు కొరడాతో కొట్టించికుంటారు.. గోవ‌ర్ధన్ పూజ తర్వాత కొరడా దెబ్బలు తింటే స‌మ‌స్యలు అన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.. ఇక, దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవ‌ర్ధన్ పూజ‌కు హాజరయ్యారు సీఎం భూపేశ్ బఘేల్.. ఈ సందర్భంగా బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తితో సీఎం భూపేశ్ బ‌ఘేల్‌ను కొరడాతో కొట్టించుకున్నారు.. ఇక, ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవ‌ర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయంగా తెలిపారు.. మ‌న సంస్కృతి, సంప్రదాయాల‌ను మ‌రిచిపోకుండా భావి త‌రాల‌కు అందించడం మనంది బాధ్యత అన్నారు. అయితే, సీఎం కొరడాతో కొట్టించుకున్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Exit mobile version