బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆదివారం రాత్రి తెలిసిపోతుంది. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. టాప్-5లో వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ప్రధాన పోటీ సన్నీ, షణ్ముఖ్ మధ్యే ఉంది. హౌస్‌లో ఎంటర్‌టైనర్‌గా సన్నీ పేరు తెచ్చుకుంటే… యూట్యూబర్‌గా ఉన్న క్రేజ్‌తో షణ్ముఖ్ ఓట్లను సంపాదిస్తున్నాడు.
Read Also: బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలే అతిథులు ఎవరో తెలుసా?
ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. సన్నీకి 34 శాతం ఓట్లు, షణ్ముఖ్‌కు 31 శాతం ఓట్లు, శ్రీరామచంద్రకు 20 శాతం ఓట్లు, మానస్‌కు 8 శాతం ఓట్లు, సిరికి 7 శాతం ఓట్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఓటింగ్ ఫలితాలు నిజమో కాదో మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునే, రామ్‌చరణ్, ఆలియాభట్, రాజమౌళి హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదైమైనా పెద్ద సెలబ్రిటీతోనే విన్నర్‌కు నిర్వాహకులు ట్రోఫీ అందిస్తారని తెలుస్తోంది.
మరోవైపు బిగ్‌బాస్-5 హోస్ట్ నాగార్జున బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ సినిమా తెలుగు ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి హీరో నాగార్జున, దర్శకుడు రాజమౌళి, రణ్‌బీర్‌కపూర్ వంటి ప్రముఖులు హాజరు కాగా… గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఉండటంతో బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున మిగతా సెలబ్రిటీల కంటే కొంత త్వరగా ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయాడు. ‘బిగ్ బాస్’ షూటింగ్‌కు వెళ్లే ముందు ఆయనకు ‘విన్నర్ ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీంతో నాగార్జున చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. మీరు ఎవరిని గెలిపిస్తే వారే విజేత అని చెప్పి చల్లగా జారుకున్నాడు.