NTV Telugu Site icon

సొంతూరుకు రానున్న సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేటి నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలోని ఎన్వీ రమణ సొంతూరైన పొన్నవరం రానున్నారు. గత రెండుసంవత్సరాల క్రితం జస్టిస్‌ ఎన్వీ రమన్‌ తన సొంతూరు వచ్చారు. అయితే తొలిసారి సీజేఐ హోదాలో స్వగ్రామానికి ఎన్వీ రమణ విచ్చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను పొన్నవరంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నందున గ్రామస్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పొన్నవరంలోని శివాలయంలో సీజేఐ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు గుంటూరు జిల్లా పెదనందిపాడులో జస్టిస్‌ లావునాగేశ్వరరావు నివాసానికి సీజేఐ వెళ్లనున్నారు. రేపు ఏపీ ప్రభుత్వం ఇచ్చే తేనేటి విందులో సీజేఐ పాల్గొననున్నారు.