Site icon NTV Telugu

క్రిస్మస్, సంక్రాంతి హాలీడేస్ ఇవే..

ఈ నెలలో క్రిస్మస్‌, జనవరిలో సంక్రాంతి పండుగలను రానున్నాయి… సంక్రాంతి పండుగ అంటే తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది.. పట్టణాలను వదిలి.. అంతా పల్లెబాట పడతారు.. దీంతో.. అసలైన పండుగ గ్రామాల్లోనే కనిపిస్తోంది.. ఇక, క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల 23 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానుండగా.. జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలుకానున్నాయి.. క్రిస్మస్‌ సెలవులు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయని.. డిసెంబర్‌ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని.. క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది..

Read Also: డిసెంబర్‌ 19, ఆదివారం రాశిఫలాలు…

మరోవైపు.. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు ఉంటాయని పేర్కొంది.. అయితే సంక్రాంతి సెలవులు క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు వర్తిస్తాయని తెలిపింది… జనవరి 17వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు కూడా సెలవులే ఉంటాయని పేర్కొంది. దీంతో.. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు రానున్నాయి.

Exit mobile version