కరోనా మహమ్మారి విషయంలో వీలు దొరికినప్పుడల్లా చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నది అమెరికా. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ చైనాపై చాలా విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిని చైనా వైరస్ అని, బయోవెపన్ అని విమర్శలు చేశారు. అంతర్జాతీయ పరిశోధకులను వూహాన్‌లోకి అడుగుపెట్టనివ్వడం లేదని, వూహాన్ ల్యాబోరేటరీలో వైరస్‌ను తయారు చేసి అక్కడి నుంచి లీక్ చేశారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై అప్పట్లో చైనా మండిపడింది. ఎన్నికల సమయంలో కాస్త మెతక వైఖరిని అవలంభించిన జో బైడెన్… మహమ్మారికి కారణం చైనానే అని ఆరోపణలు చేశారు. చైనా తీరు మార్చుకోవడం లేదని, కరోనా మూలాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ సంస్థలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై చైనా కౌంటర్ ఇచ్చింది. పదేపదే అదే విషయాన్ని అమెరికా ఎందుకు ప్రస్తావిస్తుందో అర్ధం కావడం లేదని, వైరస్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, బయో వెపన్ కాదని ఇప్పటికే నిరూపణ జరిగిందని, తమను అంతర్జాతీయంగా బ్లేమ్ చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా కౌంటర్ ఇచ్చింది.
Read: 18 నెలల తరువాత ల్యాండైన విమానాలు… కన్నీటి పర్యంతమైన టూరిస్టులు…
