కీలక పరిణామం.. తాలిబన్లతో చైనా స్నేహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల వశం అయిపోయింది.. ఎవరూ ఊహించని రేతిలో వేగంగా కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు.. అయితే, ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆఫ్ఘన్‌తో స్నేహనికి సిద్ధం అంటోంది డ్రాగన్ కంట్రీ.. ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన చైనా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది..
ఇక, ఆఫ్ఘన్ పొరుగు దేశమైన రష్యా మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నట్లు రష్యా చెప్పింది. మరోవైపు.. శరవేగంగా కాబూల్‌ను వశపరుచుకున్న తాలిబన్ల దూకుడు పట్ల అమెరికా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించిన దానికన్నా ముందే మిలిటెంట్లు కాబూల్‌లో పాగా వేశారు. ఏకంగా అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న తీరు అమెరికా అధ్యక్షుడు బైడెన్ షాక్ తిన్నట్టు సమాచారం.. ఇక, ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. అరబ్ దేశమైన ఒమన్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి డొనాల్డ్ ట్రంఫ్ కాలంలో అమెరికా సైన్యం అండగా ఉంది.. కానీ, బైడెన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. పరిస్థితి మారిపోయింది.. తమ బలగాలను అమెరికా వెనక్కి రప్పించడంతో.. తాలిబన్లు వేగంగా ముందుకు సాగి.. ఆఫ్ఘన్‌ను హస్తగతం చేసుకున్నారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!