Site icon NTV Telugu

కీల‌క ప‌రిణామం.. తాలిబ‌న్ల‌తో చైనా స్నేహం..!

Taliban

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబ‌న్ల వ‌శం అయిపోయింది.. ఎవ‌రూ ఊహించ‌ని రేతిలో వేగంగా కాబూల్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్నారు తాలిబ‌న్లు.. అయితే, ఇప్పుడు మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.. ఆఫ్ఘ‌న్‌తో స్నేహ‌నికి సిద్ధం అంటోంది డ్రాగ‌న్ కంట్రీ.. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో జ‌రుగుతున్న తాజా ప‌రిణామాల‌పై స్పందించిన చైనా.. ఆ దేశాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న తాలిబ‌న్ ఫైట‌ర్ల‌తో స్నేహ సంబంధాలు కొన‌సాగించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది..

ఇక‌, ఆఫ్ఘ‌న్‌ పొరుగు దేశ‌మైన ర‌ష్యా మాత్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆ దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్లు ర‌ష్యా చెప్పింది. మ‌రోవైపు.. శ‌ర‌వేగంగా కాబూల్‌ను వ‌శ‌ప‌రుచుకున్న తాలిబ‌న్ల దూకుడు ప‌ట్ల అమెరికా కూడా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించిన దానిక‌న్నా ముందే మిలిటెంట్లు కాబూల్‌లో పాగా వేశారు. ఏకంగా అధ్య‌క్ష భ‌వనాన్ని స్వాధీనం చేసుకున్న తీరు అమెరికా అధ్యక్షుడు బైడెన్ షాక్ తిన్న‌ట్టు స‌మాచారం.. ఇక‌, ఆఫ్ఘ‌న్ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ.. అర‌బ్ దేశ‌మైన ఒమ‌న్‌కు వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తుంది.. ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వానికి డొనాల్డ్ ట్రంఫ్ కాలంలో అమెరికా సైన్యం అండ‌గా ఉంది.. కానీ, బైడెన్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప‌రిస్థితి మారిపోయింది.. త‌మ బ‌ల‌గాల‌ను అమెరికా వెన‌క్కి ర‌ప్పించ‌డంతో.. తాలిబ‌న్లు వేగంగా ముందుకు సాగి.. ఆఫ్ఘ‌న్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్నారు.

Exit mobile version