చైనా మరోసారి కుటిలబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే చైనా పేర్లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. అయితే, చైనా దానికి ససేమిరా అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగస్వామ్యమని, దక్షిణ టిబెట్‌గా తాము పిలుస్తామని, తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంటామని, తన సార్వభౌమత్వానికి ఎవరూ అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. ఆరుణాచల్ ప్రదేశ్‌లోని 15 భూభాగాలకు చైనా పేర్లు పెట్టింది.
Read: భయపెడుతున్న మరో కరోనా వేరియంట్.. తొలి కేసు నమోదు
ఆరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నో సంప్రదాయాలకు తెగలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారని, తమ ప్రాంతంలో నివశించే ప్రాంతాలకు తాము పేర్లు పెట్టుకున్నామని చైనా విదేశాంగశాఖ మంత్రి వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చెప్పే చైనా ఆ ప్రాంతాన్ని జన్‌గ్నావ్ అని పిలుస్తుంది. 2017లో కూడా చైనా ఆరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. చైనీస్, టిబెట్ రోమన్ అక్షరాల క్రమంలో చైనా పేర్లు పెడుతున్నది. ఒకవైపు ప్రపంచం కరోనా, ఒమిక్రాన్ కేసులతో ఇబ్బందులు పడుతుంటే, చైనా మాత్రం రాజ్యాధికారం పేరుతో ఇతర దేశాల్లోని భూభాగాలపై కన్నేసింది.
