Site icon NTV Telugu

చైనాలో కొత్త చ‌ట్టం: పిల్ల‌లు త‌ప్పుచేస్తే… త‌ల్లిదండ్రుల‌కు శిక్ష‌…

చిన్న‌పిల్ల‌లు అల్ల‌రి చేయ‌డం స‌హ‌జం.  అల్ల‌రి చేసే స‌మ‌యంలో కొన్ని త‌ప్పులు చేస్తుంటారు.  పిల్లల్ని చిన్న‌త‌నం నుంచే మంచి దారిలో పెట్టాలి.  లేదంటే పెద్ద‌య్యాక దారిత‌ప్పుతారు.  పిల్ల‌లు త‌ప్పులు చేసినా, మంచి విజ‌యాలు సాధించినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రుల‌కు ద‌క్కుతుంది.  ఇక‌పై ఆ దేశంలో పిల్ల‌లు త‌ప్పుచేస్తే దానిక బాధ్య‌త‌గా తల్లిదండ్రులకు శిక్ష విధిస్తార‌ట‌.  ఇలాంటి చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు.  చైనా.  గ‌త కొంత‌కాలంగా చైనాలో పిల్ల‌లు ఆన్‌లైన్ గేమింగ్‌కు అల‌వాటు ప‌డి ట్రాక్ త‌ప్పుతున్నార‌ని గుర్తించిన చైనా ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తీసుకురాబోతున్న‌ది.  దీనికి సంబంధించి బిల్లును రెడీ చేసింది.  ఈ చ‌ట్టం ప్ర‌కారం త‌ల్లిదండ్రులు కొంత స‌మ‌యాన్ని పిల్ల‌ల కోసం కేటాయించాలి.  వారిలో పాజిటివ్ నేచ‌ర్‌ను అల‌వాటు చేయాలి.  ఏవైనా చెడు మార్పులు వ‌స్తున్నాయ‌ని గుర్తిస్తే వెంట‌నే కౌన్సిలింగ్ ఇప్పించాలి.  పిల్ల‌లు త‌ప్పులు చేస్తే త‌ల్లిదండ్రుల‌ను శిక్షిస్తామ‌ని డ్రాగ‌న్ దేశం హెచ్చ‌రించింది. 

Read: వ‌ర్షాల ప్ర‌భావం: ఉత్త‌రాఖండ్‌లో కొత్త ఇబ్బందులు…24 గంట‌లు దాటితే…

Exit mobile version