NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : చెన్నై టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు మంచి ఆరంభమే లభించింది.. కానీ దానిని జట్టు నిలబెట్టుకోలేకపోయింది. బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), దేవదత్ పాడిక్కల్(70) అర్ధశతకాలు సాధించి సెంచరీ భాగసౌమ్యాం నెలకొల్పారు. కానీ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. మిడిల్ ఆర్డర్ లోని బ్యాట్స్మెన్స్ ఎవరు రాణించకపోవడంతో బెంగళూర్ 156 పరుగులకే పరిమితమైంది. ఇక చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్ రెండు, దీపక్ చాహర్ ఒక్క వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ధోనిసేన 157 పరుగులు చేయాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.