NTV Telugu Site icon

ఆ నగరంలో ఆసుపత్రులన్నీ ఫుల్…

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.  తమిళనాడులో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు రోజుకు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి.  అయితే, చెన్నైలో ఈ కేసులు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి.  చెన్నై నగరంలో ప్రస్తుతం 50 వేల వరకు పాజిటివ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.  దీంతో నగరంలోని కరోనా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో ఫుల్ అయ్యాయి.నిత్యం కొత్త కేసులు వస్తూనే ఉండటంతో ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతున్నది.