NTV Telugu Site icon

Chandrayaan 3:మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక దాగున్న సీక్రెట్సా?

Chandrayan 3

Chandrayan 3

మన దేశ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించేలా.. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతరిక్ష రంగంలోనే మన దేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల తెలుపుతున్నారు.. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో కారణం వెలుగులోకి వచ్చింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయం వెనకాల ఆ రెండు ఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి..

చంద్రయాన్‌ 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్‌ కాఫీ ప్రముఖ పాత‍్ర పోషించిందని ఇస్రో శాస్త్రవేత్తల నుంచి సేకరించిన సమాచారంతో కథనాన్ని ప్రచురించింది. ఈ చంద్రయాన్‌ 3 సక్సెస్‌లో మసాలా దోశ, ఫిల్టర్‌ కాఫీ పాత్రపై ఈ ప్రాజెక్టు శాస్త్రవేత్త వెంకటేశ్వర శర్మ వివరించారు. అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు సైంటిస్ట్‌లకు ఓపిక, శక్తి కావాలని తెలిపారు.. అందుకే ఈ రెండు తీసుకొని అందరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పని చేశారని వెంకటేశ్వర శర్మ వెల్లడించారు..

ఇకపోతే ఇస్రో చాలా తక్కువ వ్యయంతో అత్యంత విజయవంతంగా చంద్రుడిపై ప్రయోగాన్ని పంపించి.. సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసింది ఇస్రో.. ఈ చంద్రయాన్‌ 3 మిషన్‌ను కేవలం రూ. 615 కోట్లతోనే చేపట్టి ఇస్రో మరో మైలు రాయిని అధిగమించి.. అంతరిక్ష రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్‌ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఏ దేశానికి సాధ్యం కానీ రికార్డులను సొంతం చేసుకుంది.. ఇప్పుడు సూర్యుడు పై ప్రయోగాన్ని చేసేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.. ఈ క్రమంలోనే శనివారం ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని నింగిలోకి పంపించనుంది..

Show comments