Site icon NTV Telugu

వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పిన కేంద్రం…

మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశ కరోనా వ్యాక్సిన్ ను దశల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 1 నుండి 18 ఏళ్ళు దాటినా వారికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇన్ని రోజుకు వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు అని కేంద్రం చెప్పింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు వ్యాక్సినేషన్ కు రాకపోవడంతో ఆ టీకా డోసులు వృథా అవుతున్నాయి అని.. దానిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక నుంచి 18 ఏళ్ళు దాటినా వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరే తమ వివరాలు నమోదు చేసుకొని అప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చని పేర్కొంది. కానీ ఇది కేవలం తమ నిర్ణయం మాత్రమే అని… దీని పై తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరిస్తే కేవలం ప్రభుత్వ కరోనా సెంటర్ల దగ్గరే మాత్రమే ఈ పద్ధతిని పాటించాలని… ప్రైవేటు టీకా కేంద్రాల దగ్గర వద్దని స్పష్టం చేసింది కేంద్రం.

Exit mobile version