Site icon NTV Telugu

ప్రధాని మోదీ, సిఎం జగన్ లక్షణమైన నాయకులు : ధర్మేంద్ర ప్రదాన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమున్న లక్షణమైన నాయకులు అని కొనియాడారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి రెండో టర్మ్ రెండేళ్లు పూర్తి చేసుకుంటే.. మొదటి టర్మ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారని గుర్తు చేశారు. వైద్య సదుపాయాల కల్పన, మంచి నిర్ణయాలు, పనులకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న రాష్ట్రం ఏపీ అని పొగిడారు. కరోనా నియంత్రణకై నిరంతం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని..కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనాను ఎదర్కోగలమని సూచించారు. మెగా మెడికల్ ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్న ఏపీ ముఖ్యమంత్రికి అభినందనలు అని..రాష్ట్రంలో కోవిడ్ 19 ప్రభావం తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ప్రభావం తగ్గించినట్లేనన్నారు. అన్ని రంగాల్లో ముందుండి, అన్ని అంశాల్లో చొరవ తీసుకుని..ముందుకు వెళుతున్న మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం అని పేర్కొన్నారు.

Exit mobile version