Site icon NTV Telugu

నాగాలాండ్ ఘటనపై కీలక ప్రకటన చేసిన హోంమంత్రి అమిత్‌ షా

నాగాలాండ్‌లో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటన తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనికులు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా తెలిపారు. నాగాలాండ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

Read Also: వైరల్ వీడియో: చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యం

ఈ ఘటనపై తాము విచారణకు ఆదేశించగా సైన్యం పొరపాటుగా కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. నాగాలాండ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ పౌరులు చనిపోయిన విషయంపై ఇప్పటికే నాగాలాండ్ ఉన్నతాధికారులతో తాము మాట్లాడామన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనను అడ్డం పెట్టుకుని విమర్శలు చేయడం తగదని అమిత్ షా హితవు పలికారు.

Exit mobile version