Site icon NTV Telugu

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్‌పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది.

Read Also: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్

మరోవైపు సోమవారం నాడు దేశంలో 6,531 కరోనా కేసులు కొత్తగా వెలుగుచూశాయి. మరో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 47 లక్షల 93 వేల 333కి చేరింది. అటు మరణాల సంఖ్య 4 లక్షల 79 వేల 997కి చేరుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటివరకు 578గా నమోదైంది.

Exit mobile version