NTV Telugu Site icon

ఎన్టీఆర్ కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెష్

Celebrities wish Jr NTR on 38th birthday

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి పోస్టర్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. తాజాగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడి, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్ తదితరులు ట్విట్టర్ లో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. మరోవైపు నారా లోకేష్ “ఎన్టీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇటీవలే ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఒంటరిగా ఉన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరిన విషయం తెలిసిందే.