ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం పంపి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహ్రైచ్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Also Read:YS Viveka Case: ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..!
ఐకోనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్‌రాయ్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఇన్నోవాలో ఉన్న వారంతా తమ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పంజాబ్ నుంచి శ్రావస్తిలోని కర్మోహన గ్రామానికి వస్తున్నారు. చెట్టును ఢీకొనడంతో అందరూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రాచీ సింగ్, ఎస్‌హెచ్‌ఓ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read:Fake Websites: టీటీడీ పేరుతో 40 ఫేక్ వెబ్‌సైట్లు.. నమ్మారా అంతే సంగతులు
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆరుగురు మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం బహ్రైచ్ ఆసుపత్రికి తరలించారు. ఇన్నోవాలో 14 మంది ఉన్నారు.రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీంతో పాటు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి, తగు వైద్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
